అమెజాన్‌లో ‘ఒప్పో ఫెంటాస్టిక్ డే’

SMTV Desk 2019-04-17 18:33:13  oppo fantastic day, amazon

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఒప్పో సంస్థ ‘ఒప్పో ఫెంటాస్టిక్ డే’ పేరుతో సేల్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఈ నెల 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ఒప్పో ఎఫ్11 ప్రో, ఒప్పో ఎఫ్9 ప్రో, ఒప్పో ఆర్17, ఆర్ 17 ప్రో, ఒప్పో ఏ3ఎస్ మొదలగు స్మార్ట్‌ఫోన్స్‌పై భారీగా డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కస్టమర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ.1,500 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి వివరాలను అమెజాన్ వెబ్‌సైట్‌లో వీక్షించండి. * ఒప్పో ఎఫ్11 ప్రో ఫోన్ రూ.24,990కు అందుబాటులో ఉండగా.. ఎక్స్చేంజ్ రూపంలో రూ.2,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ద్వారా చెల్లిస్తే మరో రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.* ఒప్పో ఎఫ్9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రూ.17,990కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మరో రూ.2,500 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.* ఒప్పో ఆర్ 17 ఫోన్‌ రూ.28,990కు లభిస్తోంది. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆర్ 17 ప్రో ఫోన్ ధర రూ.39,990. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. రూ.5,000 ఎక్స్చేంజ్ ఆఫర్ పొందొచ్చు.