ఓటమి భయంతో చంద్రబాబు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు!!!

SMTV Desk 2019-04-17 18:27:57  ambati rambabu, tdp, ysrcp, ys jagan mohan reddy, chandrababu, ap cm, cm chandrababu

విజయవాడ: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే టీడీపీకి 150 సీట్లు ఎలా వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబు ఓడిపోతున్నారు అని తెలిసే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నువ్వు తాత్కాలిక సీఎంగా ఉండి పోలవరంపై ఎలా రివ్యూ చేస్తావ్‌. ఇక కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. కోడెలపై ఫిర్యాదు చేస్తే నాలుగు రోజుల వరకు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు. పోలీసులు కోడెల శివప్రసాద్ చేతిలో కీలుబొమ్మలా మారారు. కోడెలది ఒక పెద్ద క్రిమినల్‌ మైండ్‌. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?. ఆయన రిగ్గింగ్‌కు ప్రయత్నించడంతోనే ఇనిమెట్ల గ్రామస్తులు తిరగబడ‍్డారు. కోడెల 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు. కోడెల నాకంటే కేవలం 928 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చి గెలిచారు. బూత్‌లోకి వెళ్లిన గన్‌మెన్‌లను కూడా వెంటనే సస్పెండ్‌ చేయాలి అని డిమాండ్‌ చేశారు.