కడుపులో కవలల ఫైటింగ్....వీడియో వైరల్

SMTV Desk 2019-04-17 18:26:55  twins fighting in mothers womb, twins, china

బీజింగ్: చైనాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తల్లి గర్భంలో ఇద్దరు కవలలు ఫైటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాకు చెందిన ఓ మహిళ గర్భంతో ఉన్న సమయంలో, వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీశారు. ఆ సమయంలో ఆమె గర్భంలోని కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్ చేస్తున్నారు. దీన్ని వీడియో తీసిన ఆమె భర్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కవలలు పెద్దయ్యాక బాక్సర్లు అవుతారని జోస్యం చెబుతున్నారు. బయటకు వచ్చాక ఇంకెలా తన్నుకుంటారోనన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.