విమర్శించండి భరిస్తా: మోదీ

SMTV Desk 2019-04-17 17:15:35  narendra modi, pm modi, pm narendra modi, bjp, loksabha elections

ముంబయి: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా మహారాష్ట్రలోని మాధాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ....రోజూ అబద్దాలు మాట్లాడే వారి గురించి పట్టించుకోవద్దని, దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మోడీ హటావో అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని విరుచుకపడ్డారు. వచ్చే ఐదేళ్లలో ఎం చేస్తామో అని విపక్షాలు చెప్పడం లేవని ఎద్దేవా చేశారు. మోడీ పేర్లు ఉన్న వారంతా దొంగలే అంటూ విపక్షాలు ప్రచారం సాగిస్తున్నాయని, దేశంలోని అవినీతి నేతలంతా తనని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 55 ఏళ్లపాటు అధికారాన్ని అనుభవించిన ఒకే కుటుంబం దేశంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు. తనని విమర్శించండి భరిస్తాను, పేదల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. గతంలో ఎన్నో కుంభకోణాలు మనం చూశామని మోడీ గుర్తు చేశారు.