ఎస్‌బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్

SMTV Desk 2019-04-17 17:12:33  sbi, sbi debit card, sbi free insurance

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ వివిధ రకాల డెబిట్ కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ప్రధానంగా బేసిక్ కార్డు, ప్రీమియం కార్డుగా విభజించుకొని బ్యాంకు ప్రీమియం డెబిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ అందిస్తున్న సేవలను పొందొచ్చు. వీటిలో పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవర్ అనే మూడు రకాల సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ గోల్డ్, ఎస్‌బీఐ ప్లాటినం, ఎస్‌బీఐ ప్రైడ్, ఎస్‌బీఐ ప్రీమియం, ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డులపై మాత్రమే ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉన్నాయి. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (డెత్) నాన్-ఎయిర్: డెబిట్ కార్డుదారుల నాన్-ఎయిర్ యాక్సిడెంటల్ డెత్‌కు ఈ పాలసీ వర్తిస్తుంది. విమాన ప్రయాణంలో మినహా ఇతర ప్రమాదాల్లో చనిపోతే ఈ పాలసీ కవర్ పొందొదు. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (డెత్): ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే ఈ పాలసీ వర్తిస్తుంది. అలాగే ఈ పాలసీ ప్రయోజనాలు పొందాలంటే సదురు వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్న ఎస్‌బీఐ డెబిట్ కార్డుతోనే ఫ్లైట్ టికెట్‌ బుక్ చేసుకొని ఉండాలి. పర్చేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్: మీరు కొనుగోలు చేసిన ప్రొడక్డులను ఎవరైనా దొంగలిస్తే ఈ పాలసీ వర్తిస్తుంది. ఇందుకు జువెలరీ‌ మినహాయింపు. ప్రొడక్టులను కొనుగోలు చేసిన 90 రోజులలోపు అయితేనే పాలసీ పనిచేస్తుంది. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న కార్డు ద్వారా ప్రొడక్టులకు కొంటేనే ఈ పాలసీ వర్తిస్తుంది.లాస్ట్ కార్డు లయబిలిటీ: మీరు మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డును పొగొట్టుకున్నారు. లేకపోతే మీ కార్డును ఎవరైనా దొంగలించారు. తస్కరణకు గురైన కార్డుతో ఎవరైనా లావాదేవీ నిర్వహిస్తే దానికి ఈ పాలసీ వర్తిస్తుంది. పిన్/ఓటీపీ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే పాలసీ పనిచేయదు.