సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కిలో బంగారం, 30 కిలోల వెండి స్వాధీనం

SMTV Desk 2019-04-17 15:53:22  secundrabad railwaystation, gold, silver

సికింద్రాబాద్‌: హైదరాబాద్ లోని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఈ రోజు ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్లాట్‌ ఫాం-6లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న కిలో బంగారం, 30 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బంగారాన్ని వ్యాపారి సుభాష్‌ వర్మకు చెందిన బంగారంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.