సైబర్ క్రైం పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు

SMTV Desk 2019-04-17 15:45:38  poonam kaur, poonam kaur case files in fake news promoters in social media, hyderabad, cyber crime police

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ హైదరాబాద్ లోని సైబర్ క్రైం పోలీసులకు తనపై సామజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై మంగళవారం ఫిర్యాదు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన అసభ్యకరమైన వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నారని తెలిపారు. తనను కించపరిచే విధంగా, తన వ్యక్తిత్వాన్ని అవమానించేలా యూట్యూబ్‌లో పోస్టులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పుకార్లు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పూనమ్ కౌర్ కోరారు.