మరింత పెరిగిన బంగారం ధర..

SMTV Desk 2017-08-17 18:28:56  gold rates, silver rates, increased

ఢిల్లీ, ఆగస్ట్ 17 : అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. శ్రావణ మాసం సందర్భంగా పసిడి కొనుగోళ్ళు ఉపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ రూ.30వేల మార్క్‌ను తాకింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌ మ‌రో రూ.300 పెరిగి రూ.30,000 మార్కును దాటి రూ.30,050గా న‌మోదైంది. అంతర్జాతీయంగా పసిడి ధర 0.43 శాతం పెరిగి సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు 1,288.30 అమెరికన్‌ డాలర్లుగా న‌మోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో వెండి ధ‌ర కూడా భారీగా పెరిగింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వెండి ధర రూ. 900 పెరగడంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి రూ. 40,200లకు చేరుకుంది.