వర్మపై ఫిర్యాదు...!

SMTV Desk 2019-04-17 15:24:05  ram gopal varma, twitter, chandrababu marfing photo

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆర్జీవి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో మార్ఫింగ్ చేసి వైసీపీ లోకి చేరుతున్నట్లు పెట్టారని పేట్‌బషీర్‌బాద్‌ పిఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిమానుల్ని కించపరిచేలా వర్మ వ్యవహరిస్తున్నారని,ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో మార్ఫింగ్‌ ఫొటోలతో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.