నా కల సాకారమైంది!

SMTV Desk 2019-04-17 14:20:09  dinesh karthik, rishab panth, icc world cup 2019, icc, bcci, ipl 2019

న్యూఢిల్లీ: మే 30 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి సెలెక్ట్ చేసిన ఇండియా టీంలో అతన్ని ఎంపిక చేసినందుకు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అందానికి హద్దుల్లేవు. ప్రపంచకప్‌కు ఎంపికవడంతో చాలా ఆనందంగా ఉంది. 2019 ప్రపంచకప్‌లో ఆడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ రోజు నా కల సాకారమైంది అని దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతున్న వీడియోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు విడుదల చేసింది. టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి దన్నుగా రిషబ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ వీరిద్దరిలో ఎవర్ని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే పంత్‌ కాకుండా దినేశ్‌కార్తీక్‌ జట్టులో స్థానం సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో ప్రపంచకప్‌. 2007లో ఆయన ప్రపంచకప్ ఆడాడు. ఆ తరువాత 12 ఏళ్లలో జరిగిన ప్రపంచకప్‌ల్లో ఆయనకు జట్టులో స్థానం లభించలేదు.