వారణాసి నుంచి బరిలోకి ప్రియాంక!!!

SMTV Desk 2019-04-17 14:18:34  priyanka gandhi, congress party, loksabha elections, robert vadra, varanasi constituency

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తుందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా మీడియాతో చెప్పారు. వారణాసి నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక సిద్ధంగా ఉన్నారని పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. గతంలో ప్రియాంక ఓకసారి మీడియా వారు ప్రశ్నించగా తాను వారణాసి నుంచే నేరుగా ప్రధాని పైనే పోటీ చేయాలని ఆమె పట్టుదలతో ఉన్నట్లు సంకేతాలు వెళ్లాయి. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రియాంక చెప్పారు. వారణాసి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతుంది.