మేత వేసేందుకు వెళ్ళిన యజమానిని చంపిన పక్షి

SMTV Desk 2019-04-17 14:17:44  Enormous Flightless Cassowary, The Worlds Most Dangerous Bird, Kills Florida Man With Its Raptor-Like Claws,

ఫ్లొరిడా: ఫ్లొరిడాలోని గేన్స్‌విల్లేకు చెందిన ఓ వ్యక్తి ‘కాస్సోవరి’ అనే పక్షిని పెంచుకుంటున్నాడు. చివరకు ఆ పక్షి చేతిలోనే హతమయ్యాడు. పూర్తి వివరాల ప్రకారం అచ్చం ఈము పక్షిలాగా ఉండే ‘కాస్సోవరి’ అనే పక్షి ప్రపంచంలేనే అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే వీటి గోర్లు 10 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వాటి దగ్గరికి ఎవరు వెళ్లినా వారి మీద పడి.. గోళ్లతో రక్కి చంపేస్తాయి. ఇవి ఆస్ట్రేలియా, పపువా న్యూ గెనియాలో ఎక్కువగా ఉంటాయి. ఇవి దాదాపు 2 మీటర్ల(6 ఫీట్లు) ఎత్తు, 60 కిలోల బరువు వరకు పెరుగుతాయి. నల్లటి ఈకలు, నీలి రంగు తల, మెడను కలిగి ఉన్న ఈ పక్షి ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. అయితే ఇవి అ్యతంత ప్రమాదకరమైన పక్షి అని తెలిసినప్పటికీ ఈ పక్షుల జాతిని కాపాడాలనే ఉద్దేశంతో దీని పెంపకం బాధ్యత గేన్స్‌విల్లేకు చెందిన ఓ వ్యక్తి తీసుకున్నారు. దానికి మేత వేసేందుకు దాని దగ్గరికి వెళ్తు.. అనుకోకుండా యజమాని కింద పడ్డారు. దీంతో వెంటనే అతనిపై దాడికి దిగిన ఈ పక్షి దాని గోళ్లతో రక్కింది. తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి చనిపోయారని వైల్డ్‌లైఫ్‌ అధికారులు వెల్లడించారు.