‘నోట్రే డామే కేథడ్రల్‌ చర్చి’ పునర్మిమాణం

SMTV Desk 2019-04-16 18:15:03  paris, Notre Dame Cathedral in central Paris, reconstruct Notre Dame Cathedral church

పారిస్ : పారిస్ లో 850 ఏళ్ళ పురాతనమైన ‘నోట్రే డామే కేథడ్రల్‌ చర్చి’ అగ్ని ప్రమదంలో కాలి బూడిదైపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చిని మళ్ళీ పునర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. ఈ ఘటనతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే వరకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తూనే ఉంటారని మేక్రాన్‌ తెలిపారు. అనేక గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చిన్నపాటి మంటలు ఎగసిపడుతుండడంతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్‌ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్‌ యూరోలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆకాశం నుంచి నీటిని చిలకరించి మంటలను అదుపులోకి తేవాలని సలహా ఇచ్చాడు. కాని దీని ద్వారా చర్చి పూర్తిగా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని భావించిన అగ్నిమాపక అధికారులు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు.