ICC వరల్డ్ కప్ 2019 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టు ప్రకటణ

SMTV Desk 2019-04-16 18:10:02  icc world cup 2019, bcb, bangladesh cricket team

ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల చివర్లో ప్రాంరంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇప్పటికే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, భారత దేశాలు ప్రపంచకప్‌ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.మష్రాఫె మోర్తజాను కెప్టెన్‌గా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ను వైస్ కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఎంపిక చేసింది. బీపీఎల్ లీగ్‌లో గాయపడ్డ షకిబ్‌ కోలుకుని ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం షకిబ్‌ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున అతను ఒకే మ్యాచ్‌ ఆడాడు. డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబి లాంటి విదేశీ ఆటగాళ్లు ఉండడంతో షకిబ్‌కు తుది జట్టులో ఆడే అవకాశం రావట్లేదు.
బంగ్లాదేశ్ క్రికెట్ టీం:
మష్రాఫె మోర్తజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మొహమ్మదుల్లా, ముష్పికర్ రహీం (వికెట్ కీపర్), షకిబ్‌ అల్‌ హసన్‌ (వైస్ కెప్టెన్‌), సౌమ్యా సర్కార్, లిటన్ దాస్, షబ్బీర్ రెహమాన్, మెహదీ హాసన్, మహమ్మద్ మిథున్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహమాన్, మొహమ్మద్ సైఫుద్దీన్, మొసద్దేక్ హుస్సేన్, అబు జాయేద్.