తల్లి ముందే కూతురిపై అత్యాచారం

SMTV Desk 2019-04-16 18:03:15  Muzaffarnagar, uttarpradesh, rape women in infront of her mother

లక్నో: ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాల సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. తాజాగా కక్రౌలి ప్రాంతంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని కక్రౌలి ప్రాంతంలో ఓ యువతిని(22) ఇద్దరు యువకులు చెరుకు చెనులోకి తీసుకెళ్లి తల్లి ముందే అత్యాచారం చేశారు. దీంతో తల్లి, కూతురు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులలో ఒకరు దిల్షాద్‌ను పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. అదే యుపిలో మరో ఘటన చోటుచేసుకుంది. షామ్లి జిల్లాలోని భబిసా గ్రామంలో 16 ఏళ్ల యువతిని గన్‌తో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై సెక్షన్ 376, 506, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.