అక్ష‌య్ కుమార్ చిత్రాన్ని చూడాలంటున్న రాష్ట్ర మంత్రి

SMTV Desk 2017-08-17 16:47:37  Akshay kumar, Haryana, Ministry of Panchayati raj, Toilet ek prem katha, swachh bharat abhiyan

హర్యానా, ఆగస్ట్ 17: ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ టాయిలెట్ చిత్రంకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఈ నేపధ్యంలో హ‌ర్యానా పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఓపీ ధ‌న్‌ఖ‌ర్, ఈ సినిమాను పంచాయితీల్లో పనిచేసే స‌ర్పంచ్‌, వీఆర్ఓల‌తో పాటు ప్ర‌తి ఒక్క గ్రామాధికారి చూడాలంటూ సూచించారు. దీని కోసం ప్రతీ జిల్లా కేంద్రంలో ప్రత్యేక షోలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, న‌రేంద్ర‌మోదీ స్వ‌చ్ఛ్ భార‌త్ ఆశయానికి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తూ, బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న‌కు వ్య‌తిరేక‌త‌ను హాస్యాస్పదంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. శ్రీ నారాయ‌ణ్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం మెట్టినింట్లో టాయ్‌లెట్ లేక‌పోవ‌డంతో పుట్టింటికి వెళ్లిపోయిన ప్రియాంక భార‌తీ క‌థ ఆధారంగా రూపొందించినది. బహిరంగ మలవిసర్జను నిషేధించాలనే ముఖ్యోద్దేశంతో హ‌ర్యానా ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.ఈ చిత్రంలో అక్షయకుమార్, భూమీ ఫ‌డ్నేక‌ర్‌లు హీరో, హీరోయిన్‌లుగా నటించారు.