ఈ పథకానికి 5 వేల కోట్లే!

SMTV Desk 2017-06-02 17:10:07  gharib kalyan yojana,black money,Arun Jaitley

న్యూ డిల్లీ, జూన్ 02 : ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం (పిఎంజీకేవై) కింద దాదాపు రూ. 5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయనీ రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా గురువారం చెప్పారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి నామమాత్ర స్పందన మాత్రమే లభించింది. దీనికి నల్లధనం వెల్లడికి అక్రమార్కులకు అవకాశమిస్తు ప్రభుత్వం గత డిసెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కలోకి రాని ఆదాయం తమ దగ్గర ఎంత ఉందో అవినీతి పరులు ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. డబ్బులో ప్రభుత్వ కు పన్ను, సర్ చార్జీ, జరిమానా కింద వాసులు చేస్తుంది. దిని వాళ్ళ మరో 25 శాతం ధనాన్ని వడ్డీ ఏమి లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్ళ పాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమ ఆదాయాలు వెల్లడికి గడువు మర్చి 31 తో ముగిసింది. అక్రమార్కుల దగ్గర ఉన్న నల్లధనాన్ని ముందుగానే పలు ఇతర ఖాతాల్లో డబ్బును జమ చేసి ఉండటం తో పన్ను, సర్ చార్జీ రెట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని హస్ముఖ్ అధియా చెప్పారు. దీని గురించి కేంద్ర ఆర్ధిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం హస్ముఖ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అదే ఏడాది అంతకన్నా ముందే స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకాన్ని తీసుకువచ్చామని, అలాగే ప్రజలు ప్రజల దగ్గరు ఉన్న నల్లధనాన్ని బ్యాంకు ఖాతాలో జమచేసి పన్ను చెల్లించారని జైట్లీ పేర్కొన్నారు. అందువలన పిఎంజీకేవై కింద వెల్లడించిన మొత్తం తక్కువగా ఉందన్నారు.