రాష్ట్ర సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

SMTV Desk 2019-04-16 17:42:25  state government of telangana, hyderabad high court, miyapur

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మియాపూర్ భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వం కొనడం కానీ, వేరే వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మియాపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది.