రెస్టారెంట్ ను ప్రారంభించిన ప్రముఖ డైరెక్టర్..

SMTV Desk 2017-08-17 16:18:27  director, surender reddy, food restaurant, hero ram charan, mp kavitha

హైదరాబాద్, ఆగస్ట్ 17 : సినీరంగానికి చెందిన ప్రముఖులు సొంత వ్యాపార౦లోకి అడుగుపెట్టడం సహజమే. అయితే తాజాగా ఆ కోవలోకి దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా అడుగుపెట్టారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో "ఉలవచారు" అనే పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించారు. నిజానికి తానూ సొంతంగా రెస్టారెంట్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కాని చివరకు హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన ఉలవచారు రెస్టారెంట్ ఫ్రాంఛైజీని తీసుకున్నాడు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత, హీరో రామ్ చరణ్ లు హాజరై సురేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.