అంబాసిడర్లలో టాప్ లో ధోని, విరాట్

SMTV Desk 2019-04-16 17:30:57  mahendra singh dhoni, virat kohli, brand ambassadors

భారత క్రికెట్ ఆటగాళ్ళు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ వీరద్దరూ తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇక వీరిద్దరూ చాలా బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించారు. అయితే ఇండియాలో ఇప్పుడు వీరు టాప్ లో ఉన్నారు. ధోని బ్రాండ్ విలువ 26.9 మిలియన్ డాలర్లుగా ఉంది. సెలబ్రెటీ బ్రాండ్ విలువ పరంగా చూస్తే ఈయన 12వ స్థానంలో ఉన్నారు. కోహ్లీ బ్రాండ్ విలువ ఏకంగా 170.9 మిలియన్ డాలర్లు. డఫ్ అండ్ ఫెల్‌ప్స్ సెలబ్రెటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ 2018 రిపోర్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ధోని చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. అవి వాటి విభాగాల్లో టాప్‌లో దూసుకెళ్తున్నాయి. రీబాక్, కోల్గేట్, గోడాడీ, టీవీఎస్, సెల్లో, సియారామ్, భారత్ మ్యాట్రీమోనీ, మాస్టర్ కార్డు ఇండియా, స్నికర్స్, ఓరియెంట్, గల్ఫ్ ఆయిల్ ఇండియా, పెప్సీ వంటి చాలా బ్రాండ్లు ఉన్నాయి. లేటెస్ట్‌గా రెడ్‌బస్ కూడా ఈ జాబితాలో చేరింది. ధోని నటించిన యాడ్స్‌లో పెప్సీ, ఓరియెంట్, స్టార్ ప్లస్, స్నికర్స్, వీడియోకాన్ టాప్‌ 5లో ఉంటాయని చెప్పుకోవచ్చు.ఇక విరాట్ కోహ్లీ.. మొబైల్ ప్రీమియర్ లీగ్, శ్యామ్ స్టీల్, అమేజ్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్, పుమా, హీరో మోటొకార్ప్, సన్ ఫార్మా, టూ యమ్, ఆడి ఇండియా, రాయల్ ఛాలెంజ్, బూస్ట్, అమెరికన్ టూరిస్టర్, ఎంఆర్ఎఫ్, ఉబెర్ ఇండియా, ఫిలిప్స్ ఇండియా వంటి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిల్లో కొన్నింటితో అంబాసిడర్ ఒప్పందం ముగిసి ఉండొచ్చు.