రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

SMTV Desk 2019-04-16 16:18:44  CM Kcr,

హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ బుధవారం సందర్శించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి 6.30గంటల మధ్య సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకుంటారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అధికారిక హడావిడి లేకుండా నేరుగా ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 3న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు నెలలు గడిచినా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి, విస్తరణ పనుల్లో పురోగతి లేనందున, కేసీఆరే స్వయంగా పరిశీలించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.