మళ్లీ మోసం చేసిన చంద్రబాబు: ముద్రగడ

SMTV Desk 2017-08-17 15:15:23  Mudragada padmanabham, kapu reservation, Ap CM, chalo amaravati, Nandyala by-polls, Chandrababu Naidu

కిర్లంపూడి, ఆగస్ట్ 17: కాపు రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కాపుల చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం కాపునేతలు సీఎంతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలోనైనా చంద్రబాబు శుభవార్త చెబుతారని తాము ఆశించామని... కానీ మళ్లీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో తెలుసుకోలేని స్థితిలో మా కాపు జాతి లేదని ఆయన ఘాటుగా స్పందించారు.