ఫలించిన పేరు మార్పిడి .. సాయి తేజ్ ఖాతాలో సూపర్ హిట్

SMTV Desk 2019-04-16 16:00:31  Sai Dharam tej, Chitralahari

హైదరాబాద్: మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా మారాడు. వరుసగా ఆరు ఫ్లాపులు అందుకున్న సాయి ధరం తేజ్ ఫైనల్ గా కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేశాడు. ఆ సినిమా ఏప్రిల్ 12న రిలీజై మిక్సెడ్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాతో సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా పేరు మార్చుకున్నాడు.

పేరులో ధరం తీసేయగా హిట్టు కొట్టాడు ఈ హీరో. మరి పేరు మార్పిడి ఎవరి సలహానో తెలియదు కాని మొత్తానికి సాయి తేజ్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడ్డది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మూడు రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 7.75 కోట్లు రాబట్టింది. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ సాయి తేజ్ ఈ హిట్ తో కెరియర్ లో నూతన ఉత్సాహం తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. ఇక మీదట అయినా కథల విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది లేదంటే మళ్లీ రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.