రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసులు

SMTV Desk 2019-04-16 15:33:10  rahul gandhi, narendra modi, congress party, bjp, supreme court, supreme court notices issued to rahul gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధానధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ... మోడీ దొంగ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సోమవారం నోటీసులు జారీచేసింది. తన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22లోగా జవాబు చెప్పాలని ఆయనను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని సుప్రీం పేర్కొంది. బిజెపి పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.