నగ్నంగా కారులో స్పీడ్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు యువతులు

SMTV Desk 2019-04-16 15:30:35  florida, florida three girls car driving in nude, Driving Naked In A Speeding Car,

వాషింగ్టన్: అమెరికాలోని ఫ్లోరిడాలో ముగ్గురు యువతులు నగ్నంగా కారులో స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాల ప్రకారం... ముగ్గురు యువతులు నగ్నంగా కారులో కూర్చుని కారును అతివేగంగా నడిపారు. పోలీసులు తమను ఫాలో అవుతున్నారని కనిపెట్టారని తెలుసుకున్న ఆ యువతులు స్పీడ్ డ్రైవింగ్ చేశారు. హైవేస్‌లో ట్రాఫిక్ ఆంక్షలకు విరుద్ధంగా స్పీడ్ డ్రైవింగ్ చేశారు. ఇంకా నగ్నంగా కనిపించి అందరి కంటపడ్డారు. స్పీడ్ డ్రైవింగ్‌తో ఆ రోడ్డుపై వాహనాలను నడిపిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. సినీ ఫక్కీలో పోలీసులు 33కిలోమీటర్ల మేర ఫాలో చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ ముగ్గురు యువతులు నగ్నంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. ఆపై జరిగిన విచారణలో స్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రైయింగ్ కోసం అలా కారులోకూర్చున్నట్లు సదరు యువతులు వెల్లడించారు. ఆ ముగ్గురిలో బండిని నడిపిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలని మిగిలిన ఇద్దరు యువతులకు 19 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. యువతులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.