భువీ రికార్డ్

SMTV Desk 2019-04-16 15:20:10  bhuvaneshwar kumar, sunrisers hyderabad, ipl 2019

హైదరాబాద్‌: ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు భువనేశ్వర్‌ కుమార్ ఓ రికార్డు సృష్టించాడు. ఆదివారం రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ను పెవిలియన్ పంపిన భువీ తాను ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడిన వందో మ్యాచ్ లో వందో వికెట్ పడగొట్టిన మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్‌లో ఇప్పటి వరకు 109 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 125 వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్‌ కన్నా ముందు ఆర్సీబి, పుణెవారియర్స్‌ జట్లకు భువీ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక భువీ 100వ మ్యాచ్‌లో వందో వికెట్ పడగొట్టిన సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అతడికి అభినందనలు తెలియజేసింది. దీంతో భువీకి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ‘స్వింగ్‌ కింగ్‌కు సెల్యూట్‌.. 100వ మ్యాచ్‌ 100 వికెట్‌ శభాష్‌ భువీ’ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక ఉప్పల్ వేదికగా జరిగిన ఢిల్లీ మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ పరాజయం పాలైంది. దీంతో ఈ సీజన్ లో వరుసగా మూడు మ్యాచులు ఓటమి చవిచూసింది ఆరెంజ్ ఆర్మీ.