డ్యూయెల్ రోల్ లో బన్నీ!!!

SMTV Desk 2019-04-16 15:19:06  stylish star allu arjun, allu arjun, venu ariram, allu arjun duel role

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో బన్నీ ఫస్ట్ టైం డబుల్ రోల్‌లో నటించడానికి సిద్దం అవుతున్నారట. ఇందులో బన్నీ పోషించే రెండు పాత్రలు పూర్తి విభిన్నంగా ఉంటాయని తెలిసింది. ఈ స్టార్ హీరో ప్రతి సినిమాలో తన గెటప్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఇక డబుల్ రోల్ అంటే ఒక పాత్రకు రెండో పాత్రకు సంబంధం లేకుండా తన లుక్‌లో కొత్తదనం చూపించడం ఖాయం. ఇప్పటివరకు 18 సినిమాలు చేసిన బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒప్పుకున్నాడంటే వేణు శ్రీరామ్ కథలో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది.