అవును టీడీపీలో చేరబోతున్నా : గంగుల ప్రతాప్ రెడ్డి

SMTV Desk 2017-08-17 12:57:52  NANDHYALA ELECTIONS, GANGULA PRATHAP REDDY, CM CHANDRABABU NAIDU

నంద్యాల, ఆగస్ట్ 17 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో తానూ టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు గంగుల ప్రతాప్ రెడ్డి. చంద్రబాబుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు తననెంతో ఆకర్షించాయని, ఒకే ఇంట్లోని వారు వేరు వేరు పార్టీల్లో ఉండడం తప్పే౦ కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టీడీపీలో తను ఎటువంటి పదవులను ఆశించి రావట్లేదని తెలిపారు. కాగా చంద్రబాబు ఈ నెల 19 న నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సమయంలోనే ప్రతాప్ రెడ్డి టీడీపీ కండువాను కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని వచ్చిన వార్తలతో అఖిల ప్రియ తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించి ప్రచారం మధ్యలోనే వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.