CSK టార్గెట్ 162

SMTV Desk 2019-04-16 14:25:24  IPL 2019. CSK VS KKR

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి చెన్నైకి 162 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. కోల్‌కతా బ్యాట్స్ మెన్ క్రిస్‌లిన్ (82), సునీల్ నరైన్ (2) , నితీశ్ రాణా(21), రాబిన్ ఉతప్ప( 0), ఆండ్రీ రసెల్(10), శుభమన్ గిల్(15), పీయూస్ చావ్లా(4 ), కుల్దీప్ యాదవ్(0), దినేశ్ కార్తీక్(18 ) పరుగులు చేసి 161 పరుగులు చేశారు.