ఎన్నికల్లో జరిగిన దాడిపై నిజనిర్ధారణ కమిటీని నియమించిన జగన్

SMTV Desk 2019-04-16 14:19:22  ap elections, tdp, ysrcp, ys jagan mohan reddy

విశాఖపట్నం: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులపై నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పర్యటించి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన అనుచరులు చేసిన దాడులపై నిజనిర్థారణ చేయనుంది. మర్రి రాజశేఖర్ నేతృత్వంలో 10 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా గురజాల, నరసరావుపేటలలో వైసీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమిట్లలోని ఓ పోలింగ్ బూత్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు హల్ చల్ చేశారు.