'సాహో' ప్రభాస్, శ్రద్ధ స్టిల్స్ లీక్...వైరల్

SMTV Desk 2019-04-16 10:10:46  prabhas, shradda kapoor, sujeeth, saaho, saaho pic leak

ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో . ఈ సినిమాని ఇప్పటికే ఆగష్టు 15 న విడుదల చేస్తామని ప్రకటించేసారు. హాలీవుడ్ ప్రమాణాలతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ప్రభాస్, శ్రద్దాల ఒక రొమాంటిక్ పిక్ లీక్ అయ్యింది. ఆ పిక్ కాస్త వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులంతా పండగ రోజు కానుకగా ఉంది అంటూ ఆ పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కేవలం పాటలు మాత్రమే కాకుండా మరో కీలక యాక్షన్ బ్లాక్ కూడా బాకీ ఉందట. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయట. ఈ పాటలు మరియు ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ పూర్తయితే ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి దిగి అనుకున్న సమయానికి సినిమాని విడుదల చెయ్యాలని “సాహో” టీమ్ భావిస్తున్నారట.