‘ఆర్ఆర్ఆర్‌’ లో ప్రభాస్ !!!

SMTV Desk 2019-04-15 10:54:05  RRR, Ram charan, NTR, Rajamouli, prabhas

హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి ముల్టీ స్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్‌’. ఈ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఅర్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ కూడా న‌టించ‌బోతున్నాడ‌నే వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామ‌రాజు, కొమరం భీమ్ పాత్రలు ప్ర‌భాస్ వాయిస్‌ ఓవర్‌తోనే ప్రారంభం అవుతాయ‌ని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, మ‌రోవైపు ప్ర‌భాస్ ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకే సినిమాలో ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు ఉండవని అంటున్నారు. అలాగే ఇటీవల ఈ చిత్రం నుండి త‌ప్పుకున్న బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ స్థానంలో నిత్యా మీన‌న్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జ‌రుగుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై స్పష్టత ఎప్పుడొస్తుందో చూడాలి.