ఏపిని రావణకాష్టంగా మార్చారు!

SMTV Desk 2019-04-15 10:44:30  ap cm, cm chandrababu, state election commission, central election commission

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సీఈసిని కలిసి చంద్రబాబు బృందం గంటన్నర పాటు చర్చించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..ఏపి ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని, నేరస్తులు చెబితే అధికారులను బదిలీ చేశారని, మాజీ ఎంపి వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించేకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలనను నిర్వీర్యం చేయాలని చూశారని, స్పీకర్‌పై దాడులు చేశారని, ఏపిని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసి విఫలమైందని, ఓటర్లు ఈసికి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కంకణం ట్టుకున్నారని ,ఈవిఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలున్నాయని చంద్రబాబు తెలిపారు.