అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది : చిన్మయి

SMTV Desk 2019-04-14 12:05:50  Actress Khushboo sundar slapped a man , chinmayi sripada, vairamuttu, mee too

బెంగుళూరు: కొద్ది రోజుల క్రితం మీటూ ఉద్యమం పేరుతో వార్తల్లో నిలిచి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తాజాగా మళ్ళీ వార్తల్లోకెక్కింది. మీటూ ఉద్యమంలో భాగంగా పదేళ్ల క్రితం సీనియర్ గీత రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీన్ని వైరముత్తు ఖండించారు కూడా. లైంగికంగా వేధించిన విషయం పదేళ్ల తర్వాత నీకిప్పుడు గుర్తొచ్చిందా? అని మరికొందరు ఆమెను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిన్మయి సమాధానమిస్తూ.. ‘ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా’ అని మండిపడింది.. అయితే చిన్మయి ఇలా అనడానికి చేయడానికి మరో కారణం ఉంది. ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి నేత రిజ్వాన్ అర్షద్ నిర్వహించిన ర్యాలీకి ఖుష్భూ మద్ధతు పలికారు. ఈ ర్యాలీ‌లో ఓ వ్యక్తి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. దీంతో ఖుష్భూ అతని చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చిన్మియితో చాట్ చేసిన ఓ నెటిజన్ ఈ ప్రస్తావన తీసుకురాగా.. ‘వైరముత్తు కనిపిస్తే ఈ సారి ఖచ్చితంగా చెంప చెళ్లుమనిపిస్తా. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది’ అని చిన్మయి పేర్కొంది. దీంతో ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.