మార్క్‌ జుకర్‌బర్గ్‌ భద్రత ఖర్చు రూ. 138 కోట్లు

SMTV Desk 2019-04-14 12:04:54  facebook, facebook ceo, mark zuckerberg, mark zukerberge security expenses

వాషింగ్టన్: ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఏడాదికి తన జీతం కేవలం ఒక డాలరు తీసుకుంటున్నాడు. అయితే అతని భద్రతకు మాత్రం ఫేస్‌బుక్‌ సంస్థ ఏటా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. 2018లో జుకర్‌బర్గ్‌ భద్రత కోసం 20 మిలియన్‌ డాలర్లు (రూ. 138 కోట్లు) ఖర్చు చేసింది. ఈ వివరాలను కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. జుకర్‌బర్గ్‌ మూడేళ్లుగా మూలవేతనం కింద కేవలం ఒక డాలరు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఇతర సదుపాయాల కింద 2018లో 22.6 మిలియన్‌ డాలర్లను కంపెనీ ఖర్చు చేసింది. అందులో 90 శాతం జుకర్‌, ఆయన కుటుంబం భద్రతకు వెచ్చించారు. మిగతా సొమ్మును అతని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేసింది. ఉగ్రవాద సంస్థలు, ఇతర నేర ముఠాల ప్రచారానికి ఫేక్ బుక్ చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన కంపెనీ కనుక కొన్ని ఉగ్రవాద సంస్థలకు ఫేస్ బుక్ టార్గెట్‌గా మారింది. జుకర్‌బర్గ్‌ను చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయి.