మే 23న అనూహ్య ఫలితాలు : శివాజీ

SMTV Desk 2019-04-14 11:54:01  actor shivaji, lok sabha elections, assembly elections, election commission officer, trs, tdp, ysrcp, bjp

అమరావతి: ఏపీ ఎన్నికలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు శివాజీ. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. బిజెపి ఒక నూతన డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. టిఆర్‌ఎస్‌కు 16 ఎంపి సీట్లు, జగన్‌కు 17 ఎంపి సీట్లు వస్తాయని తొలివిడత జరిగిన పోలింగ్‌లో ఎన్డీయేకు మరో 39 సీట్లు కలిపి మొత్తం 72 స్థానాలు తమ సొంతమవుతాయని బిజపి ప్రచారం చేసుకుంటుందని వివరించారు. జగన్‌ బెస్ట్‌ సియం అంటూ ప్రశాంత్‌ కిషోర్‌ పొగడడం వంటి కొన్ని వీడియోలు విడుదల చేశారు. అయితే ఇవి కేవలం ఊహలు మాత్రమేనని శివాజీ కొట్టిపారేశారు. మే 23న అనూహ్య ఫలితాలు ఉండబోతున్నాయని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.