ఈసీకి ఎంపి విజయసాయిరెడ్డి లేఖ

SMTV Desk 2019-04-14 11:47:54  central election commission of india, ysrcp mp vijay saireddy, tdp, chandrababu

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవిఎంల రక్షణకు కేంద్ర బలగాలను నివియోగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని స్వయంగా ఒక ముఖ్యమంత్రే సిఈఓకు చెప్పడం విడ్డూరంగా ఉందని, ఈ నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే, సిఆర్పీఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌ బలగాలను కాపలాగా ఉంచాలని, 24 గంటలు సిసి కెమెరాలు పనిచేసేలా అమర్చాలని కోరారు.