పెళ్ళికి ముందు సెక్స్...అత్యాచారంగా సుప్రీం తీర్పు

SMTV Desk 2019-04-14 11:31:16  supreme court, sex before marriage is crime,

న్యూఢిల్లీ: పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసి సెక్స్ చేస్తే నేరంతో సమానమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని న్యాయస్థానం తీర్పునిచ్చింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, ఎంఆర్ షా లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌కోని ప్రాంతానికి చెందిన అమ్మాయికి డాక్టర్ అనురాగ్‌సోని‌తో 2009 నుంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనురాగ్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆ మాటలు నమ్మిన యువతి అతనితో కలిసి సెక్స్‌లో పాల్గొంది. కొద్దిరోజుల తర్వాత పెళ్లి గురించి డాక్టర్ దగ్గర ప్రస్తావించగా అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. పెళ్లి పేరుతో అమ్మాయితో సెక్స్ చేసి, మోసం చెయ్యడాన్ని సీరియస్ గా తీసుకుంది. పెళ్లికి ముందు సెక్స్ నేరమని, అది అత్యాచారంతో సమానమని పేర్కొంటూ.. డాక్టర్ అనురాగ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చాలా జరుగుతన్న నేపథ్యంలో కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేయ్యాల్సిందేనని న్యాయమూర్తి పేర్కొన్నారు.