అన్ని పార్టీలు డబ్బున్న వారికే టికెట్లు ఇస్తుంది!!!

SMTV Desk 2019-04-14 11:19:25  v hanumanthurao, congress party, tdp, ysrcp, janasena, andhrapradesh elections

తిరుమల: కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని ఆ పార్టీ అగ్రనేత నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ విధానాలను హనుమంతరావు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు సైతం ఎన్నికల్లో పోటీ చేసే విధంగా మార్పు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందని, కాంగ్రెస్ లో సైతం ఇదే పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.