పోలింగ్ గొడవలపై జగన్ ఎందుకు మాట్లడంలేదు!!!

SMTV Desk 2019-04-14 11:06:28  andhrapradesh elections, polling, ysrcp, ys jagan mohan reddy, tdp, sabbamhari

విశాఖపట్టణం: రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అవకతవకల గురించి వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఇంత వరకు పెదవి విప్పకపోవటం ఆశ్చర్యంగా ఉందని టిడిపి నేత సబ్బంహరి అన్నారు. ఈ పోలింగ్‌ ప్రక్రియపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ.. అంతా సవ్యంగా జరిగిందంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 2 లేదా 3 ఈవిఎంలు పని చేయకపోతే జగన్‌ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజలు టిడిపికి బ్రహ్మరథం పట్టారని, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు టిడిపికి పది సీట్లు పెరిగే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వైఎస్‌ఆర్‌సిపికి 20 సీట్లు తగ్గే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.