ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రంలో భేటి

SMTV Desk 2019-04-14 10:42:58  Ministry of Home Affairs, andhrapradesh, stpal chouhan

న్యూఢిల్లీ: ఏపి పునర్విభజన చట్టంపై హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్‌ చౌహన్‌ నేతృత్వంలో శుక్రవారం కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విభజన చట్టంలోని 13 షెడ్యూల్‌ అమలుపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. విభజన చట్టంలోని పెండింగ్‌ విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులూఏపీ నుంచి ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌కుమార్‌, కరికాల వలవన్‌తో పాటు దమయంతి, ఆరోఖ్యరాజ్‌, ప్రేమ్‌చంద్రారెడ్డి హాజరుకాగా.. తెలంగాణ నుంచి రామకృష్ణారావు, వేదాంతం గిరి హాజరయ్యారు.