ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఓపెన్

SMTV Desk 2019-04-12 19:40:06  prabhas, prabhas instagram account

హైదరాబాద్ : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. అయితే ఈ ఖాతాలో ఫొటో గానీ, వీడియోలు గానీ.. కనీసం అకౌంట్‌ ప్రొఫైల్‌ ఫొటో కూడా పోస్టు చేయలేదు. పైగా ఆయన అకౌంట్‌ ను అధికారికంగా ప్రకటించకముందే దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్‌ చేరడం గమనార్హం. ప్రభాస్‌ ప్రస్తుతం సాహో షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. డార్లింగ్‌కి జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం హాలీవుడ్‌ స్థాయిలో తీస్తున్నారని, షూటింగ్‌ కు సంబంధించిన ఏ విషయంలోనూ తగ్గకుండా చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.