ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాపరింగ్‌ చేశారు!!

SMTV Desk 2019-04-12 18:36:28  andhrapradesh cm, chandrababu, tdp, election commission, evm machines

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌, జగన్‌ చెబితే ఈసీ పాటిస్తుందన్నారు. వాళ్లు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్లను బదిలీ చేశారని చెప్పారు. ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాపరింగ్‌ చేశారన్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలు దృఢ సంకల్పంతో ఓటేయడానికి వచ్చారన్నారు. ఇంతమందిని అంత ఉదయమే ఎప్పుడైనా చూశామా? అని అడిగారు. ఈవీఎంలు పనిచేయకపోతే మూడుసార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టంచేశారు. సీఈవోనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవాచేశారు. సీఈవోనే ఓటేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలు రీప్లేస్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల భవిష్యత్‌ని ఒక మిషన్‌ మీద వదిలిపెట్టారన్నారు. ఒంటిగంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తారా? అంటూ ధ్వజమెత్తారు.