ఎస్‌బీఐ ఎటిఎం కమ్ డెబిట్ కార్డు సర్వీసెస్

SMTV Desk 2019-04-12 18:32:00  state bank of india, sbi atm and debit card

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నూతనంగా వివిధ రకాల ఎటిఎం కమ్ డెబిట్ కార్డుల సేవలందిస్తోంది. వీటిలో క్లాసిక్ డెబిట్ కార్డు, గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు వంటివి ఉన్నాయి. ఈ ఎటిఎం కార్డు నగదు ఉపసంహరణకు పరిమితులు విధించింది. ఉదాహారణకు ఎస్‌బిఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కస్టమర్లకు రోజుకు రూ.40 వేల వరకు ఉపసంహరణ అనుమతిని ఇస్తోంది. ఈమేరకు బ్యాంక్ వెబ్‌సైట్ వెల్లడించింది. అలాగే ఆన్‌లైన్ లావాదేవీలకు రోజుకు రూ.75 వేల వరకు అనుమతి ఇస్తోంది. ఎటిఎం కమ్ డెబిట్ కార్డు వంటి సేవలకు చార్జీలను కూడా నిర్ణయించింది. ఎస్‌బిఐ వెబ్‌సైట్ ప్రకారం, ఎటిఎం కమ్ డెబిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ వంటి గ్రూప్ ఎటిఎంలలో వినియోగించవచ్చు.