ఘననీయంగా పెరుగతున్న దేశ జనాభా...ప్రస్తుతం 136 కోట్లు

SMTV Desk 2019-04-12 18:20:09  india, china, indian population, indian population increases

భారతదేశ జనాభా 136 కోట్లకు చేరింది. చాలా వేగంగా ఇండియా జనాభా పెరుగుతూ పోతోంది. 2010 నుంచి 2019 వరకు ఏటా సగటున 1.2శాతం జనాభా వృద్ధి రేటు నమోదవుతోంది. యూఎన్‌పీఎఫ్‌ నివేదిక ఈ అంశాన్ని స్పష్టంచేస్తోంది. చైనా జనాభా పెరుగుదల రేటుతో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువ. 2010 నుంచి 2019 వరకు చైనాలో సగటున కేవలం 0.5 శాతం జనాభా వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. సంతానోత్పత్తి రేటు గతంతో పోలిస్తే ఇండియాలో చాలా తగ్గింది. అయితే జీవన ప్రమాణాలు పెరిగాయి. 1969లో సగటు ఆయురార్దం 47 ఏళ్లు కాగా..2019 నాటికి 69 ఏళ్లకు పెరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి గణాంకాలతో కూడిన స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ 2019 నివేదికను.. యూనైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ వెల్లడించింది. ఇండియాలో హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ కూడా బాగా మెరుగైంది. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. 1994లో ప్రతి లక్ష జననాల్లో 488 మంది శిశువులు చనిపోయేవారు. 2015 నాటికి ఆ సంఖ్య 174కు తగ్గింది. ప్రస్తుతం శిశుమరణాలు మరింత తగ్గాయి. అయితే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని.. స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ 2019 నివేదిక స్పష్టం చేసింది. 1969లో సగటున ఒక్కో మహిళ 5 మందికి జన్మనివ్వగా..1994 నాటికి ఆ సంఖ్య 3కి తగ్గింది. ప్రస్తుతం 2 నుంచి 3 మధ్యలో నమోదవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి రీప్రొడక్టివ్‌ సిస్టమ్‌ హెల్త్‌ సర్వీసులు అవసరమనీ యూఎన్‌పీఎఫ్‌ నివేదిక తేల్చి చెప్పింది. గర్బం, ప్రసవం సమయంలో మహిళలు ఎక్కువగా చనిపోతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి రోజు 500 మంది మహిళలు, బాలికలు మృతి చెందుతున్నారని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ సర్వీసులు ఉన్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని నివేదికలో వెల్లడించింది.