కేంద్ర సర్కార్ పై మాజీ సైనికోద్యోగులు ఫైర్

SMTV Desk 2019-04-12 18:02:22  ex army officers fired on indian central government, indian army, indian navy

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశ మాజీ సైనికులు, చీఫ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివిధ ద‌ళాల‌ల‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోరాదు అని ర‌క్ష‌ణ‌శాఖ మాజీ ఉద్యోగులు రాష్ట్ర‌ప‌తి రామ్‌ నాథ్‌ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సుమారు 156 మంది మాజీ సైనికోద్యోగులు ఆ లేఖ‌లో సంత‌కం చేశారు. ఆ లేఖ‌లో సంత‌కం చేసిన వారిలో మాజీ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు ఉన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్‌, జ‌న‌ర‌ల్ శంక‌ర్ రాయ్ చౌద‌రీ, జ‌న‌ర‌ల్ దీప‌క్ క‌పూర్‌తో న‌లుగురు మాజీ నేవీ చీఫ్‌లు ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎన్సీ సురి కూడా ఆ లేఖ‌లో సంత‌కం చేసిన‌వారిలో ఉన్నారు. స‌రిహ‌ద్దు దాటి ఉగ్ర‌వాదులను మిలిట‌రీ చంపేస్తుంటే.. దాన్ని కొన్ని పార్టీలు రాజ‌కీయం చేస్తున్నాయ‌ని మాజీలు ఆరోపించారు.