రిలీజ్ కు ముందే రికార్డులు బ్రేక్

SMTV Desk 2019-04-11 12:04:37  maharshi, mahesh babu, vamshi paidipally, maharshi movie satellite rights

హైదరాబాద్: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా మహర్షి . ఈ సినిమా విడుదలకు ముందే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.140 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇది నాన్-బాహుబలి రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడట. మే 9న విడుదల కానున్న ఈ సినిమాకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలోనే రూ.47.50 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే తెలుగు శాటిలైట్ హక్కుల రూపంలో రూ.14.5 కోట్లు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులకు రూ.20 కోట్లు, డిజిటల్ హక్కులకు రూ.11 కోట్లు, ఆడియో హక్కులకు రూ.2 కోట్లు వచ్చాయట. ఇక ఓవర్ సీస్‌లో సుమారు రూ.12.5 కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇక ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాల హక్కులను కూడా కలిపితే ఈ మొత్తం రూ.140 కోట్లకు పైనేనని సమాచారం. మహేశ్ కెరీర్‌లో ఇది ఆల్ టైమ్ రికార్డు.