అందుకే మమ్మల్ని మీడియా పట్టించుకోదు

SMTV Desk 2019-04-11 11:57:28  narendra modi, kumaraswamy, bjp, loksabha elections

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భారత ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఆయన ప్రసంగించారు. బీజేపీ నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం మానేసి మోదీ ముఖం చూసి ఓటెయ్యాలని కోరడంపై మండిపడ్డారు.‘మోదీ రోజూ ఉదయం లేవగానే చక్కగా మేకప్ వేసుకుంటారు. వ్యాక్సింగ్ కూడా చేయించుకుని అందంగా కనిపిస్తారు. అందుకే ఆయనను మీడియా పదేపదే చూపిస్తుంది. ప్రతిపక్షాల వాళ్లం మేము ఆయనంత అందంగా ఎక్కుడున్నాం. పైగా మేం అందగాళ్లం కూడా కాకపాయె. మా మొహాలకు మేకప్ వేసుకోవడం రాదు. అందుకే మమ్మల్ని మీడియా పట్టించుకోదు కాబోలు. బీజేపీ నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం మానేసి మోదీ ముఖం చూసి ఓటెయ్యాలని కోరుతున్నారు. కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. విమర్శలు చేసేవాళ్లను స్వేచ్ఛగా చేసుకోనివ్వాలని.. అలాంటివి పట్టించుకోవద్దని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఇకపైన పొత్తు కొనసాగుతుందని అన్నారు.