నంద్యాల ఉపఎన్నికల్లో పవన్ మద్దతు

SMTV Desk 2017-08-16 16:35:15  Pawan kalyan, Janasena, AP politics, Namdyala by-polls, Janasena support

నంద్యాల, ఆగస్ట్ 16: నంద్యాల ఉపఎన్నికల్లో జనసేన మద్దతు విషయమై ఇప్పటి వరకు నెలకున్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఎన్నికల్లో తాము తటస్థం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో పవన్ మద్దతు మా పార్టీకే అంటూ ఆశలు వ్యక్తం చేసిన వారందరికీ నిరాశే మిగిలింది. నంద్యాల మద్ధతు పై జనసేన అధినేత మాట్లాడుతూ... 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి జనసేన మద్దతు ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన తెలిపారు. తాజా ఈ పరిణామంతో విజయం ఎవరిని వరిస్తుందనే దానికోసం ఈ నెల 29వరకు వేచిచూడాల్సిందే.