సీఈవో బ్లాక్‌ ముందు ఏపీ సీఎం ధర్నా

SMTV Desk 2019-04-10 16:36:13  ap cm chandrababu, ceo block strike, election commission

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సీఈవో బ్లాక్‌ ఎదుట నిరసనకు దిగారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులకు నిరసనగా ఆయన ధర్నాకు దిగారు. అంతకముందు చంద్రబాబు సీఈవో ద్వివేదిని కలిశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. అయితే సిఎం ఫిర్యాదుపై ద్వివేది సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌పిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎన్నికల కమిషన్‌ తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. కాగా ఈ నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.